దూరమవుతున్న మనుషులు
వీడిపోని మమతలు....
కదిలిపోతున్న కాలం
కదలనంటున్నపాదం...
భారమవుతున్న మనసులు
మరువలేని అనుబంధాలు...
నీవెక్కడ ఉన్నా నా మది నీతోనే...
నేనెక్కడ ఉన్నా నీ హృది నాతోనే...
నను వీడకు ఓ నేస్తం నే వదలను నీ హస్తం...
నీ జ్ఞాపకాల నీడలో నును వెచ్చని నీ ఒడిలో
ఒదిగిపోవాలని ఉంది...
నను మరువకు ఓ మిత్రమా...
నా హృదయం నీ కోసమే ఎదురు చూస్తూ
నీ కోసమే వేచియుంటుంది ఎన్నటికీ....!!!
No comments:
Post a Comment