Wednesday, November 24, 2010

నా మైత్రీ...

నీవే నా నెచ్చేలివని
నీవే నా ప్రాణమని తలచాను..
కానీ ఈ పయనం తాత్కాలికమని 
కాలమే తెలిపాక
నిను విడిచి నేనెలా ఉండగలను మిత్రమా...
వీడలేక వీడలేక 
నిను వీడి వెనుతిరిగి చూడలేక
కదులుతున్నా కాలంతో...
భారమైన హృదయంతో...
నను మన్నించు ఓ మిత్రమా...!
మరుజన్మలోనైనా నీతోనే ఉంటాను...
నిను వీడని నీ నీడై
కలకాలం నీ తోడై...!!!

Sunday, November 21, 2010

మీ స్నేహం...



నా జీవన పయనంలో
నా నీడై నా తోడై నను వెన్నంటే ఉన్నారు...
మీ మనసులో స్థానమిచ్చి 
మీ స్నేహపు పరిమళాలు నాకు పంచి
ప్రేమ, అభిమానం, ఆప్యాయతలను అందించి
మీతో ఈ బంధాన్ని మరువలేని అనుబంధంగా మార్చిన
మిత్రులారా...!!!
వీడిపోతున్నాననే బాధ నాకు లేదు...

మరల మరల మిమ్మల్ని కలవాలని,
ఆ కలయికలో మాధుర్యాన్ని ఆస్వాదించాలని,
ఉరకలెత్తుతున్న నా మదిలోని ఆరాటమే 
ఎప్పటికి నన్ను మీతో కలిపి ఉంచుతుంది...

నీ ప్రాణం...

దూరమవుతున్న మనుషులు
వీడిపోని మమతలు....
కదిలిపోతున్న కాలం
కదలనంటున్నపాదం...
భారమవుతున్న మనసులు
మరువలేని అనుబంధాలు...
నీవెక్కడ ఉన్నా నా మది నీతోనే...
నేనెక్కడ ఉన్నా నీ హృది నాతోనే...
నను వీడకు ఓ నేస్తం నే వదలను నీ హస్తం...
నీ జ్ఞాపకాల నీడలో నును వెచ్చని నీ ఒడిలో
ఒదిగిపోవాలని ఉంది...
నను మరువకు ఓ మిత్రమా...
నా హృదయం నీ కోసమే ఎదురు చూస్తూ
నీ కోసమే వేచియుంటుంది ఎన్నటికీ....!!!

Thursday, November 11, 2010

మీ స్నేహం...


మీ కోసమే అన్వేషణ   మీ ధ్యాసలో ఆలోచన
అనునిత్యం మీ జ్ఞాపకాలు  నా మదినే తడుతుంటే
మీతో గడిపిన ప్రతిక్షణం   అనంతమై అమూల్యమై 
మరల మరల రావాలని   మీరే నాకు కావాలని
మీ స్నేహపు మధురిమలో జ్ఞాపకాల దొంతరలో
నా హృదయం నా జీవన మృదంగమై పరవశించి పాడుతుంటే
మీ ప్రాణం మీ కోసమే వేచి చూస్తుంటే 
నా గది స్వప్నాలతో నిండుతోంది 
నా మది స్వగతాలతో క్రుంగుతోంది...

Wednesday, November 10, 2010

మరణం...


చివరనున్న కిటికీలోంచి బయట వెలుగు రేకులు నెమ్మదిగా విచ్చుకుంటాయి...
తెల్లవారుతుంది ... మామూలుగానే!
‘నువ్వు లేకపోయినా గాలి వీస్తుంది...
సముద్ర కెరటాలు ఆగిపోవు...
పక్షులు ఎగురుతూనే వుంటాయి.
సూర్యోదయాలూ సూర్యాస్తమయాలూ జరుగుతూనే వుంటాయి.
అన్నీ మామూలుగానే వుండి నీకు స్నేహితులు మాత్రం లేకపోవడమే మరణం అంటే..!’